అక్షర టుడే, ఆర్మూర్‌ : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని బీజేపీ కిసాన్‌ మోర్చా రాష్ట్ర నాయకులు నూతల శ్రీనివాస్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆర్మూర్‌లో కురిసిన వర్షాలకు మొక్కజొన్నలు తడిసిపోవడంతో మంగళవారం ఆయన పరిశీలించారు. మొక్కజొన్నలకు రూ.500 బోనస్‌ ఇచ్చి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.