అక్షర టుడే, కామారెడ్డి టౌన్‌: అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన కార్పొరేషన్‌ సంస్థ చైర్మన్‌ తేజావత్‌ బెల్లయ్య నాయక్‌ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సోమవారం ఆయన విచ్చేసిన సందర్భంగా వివిధ ఎస్టీ సంఘాల నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెల్లయ్య నాయక్‌ మాట్లాడుతూ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశామని, కొన్ని సాంకేతిక కారణాలో రుణమాఫీ కాని రైతులకు త్వరలో అవుతుందని తెలిపారు. రైతులు ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలులేవని ఈవిషయం సీఎం రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఎస్టీ సెల్‌ అధ్యక్షులు రాణా ప్రతాప్‌ రాథోడ్‌, లంబాడ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గణేష్‌ నాయక్‌, సోషల్‌ మీడియా కోఆర్డీనేటర్‌ ప్రకాష్‌ నాయక్‌, కామారెడ్డి మండల అధ్యక్షులు మోహన్‌ నాయక్‌, పులి సింగ్‌, వినోద్‌ , గణేష్‌ ,ప్రకాష్‌,మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు పాల్గన్నారు.