Advertisement

అక్షరటుడే, ఇందూరు: కాంగ్రెస్‌ పార్టీ మహిళా సభ్యత్వ నమోదులో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచారు. దీంతో సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన నారీ న్యాయ సమ్మేళన్‌లో ఆలిండియా కాంగ్రెస్‌ మహిళా అధ్యక్షురాలు అల్కాలంబా ఆమెను అభినందించారు. లక్షకుపైగా సభ్యత్వ నమోదు చేయడంతో ఆమెను ప్రశంసించి, శాలువాతో సన్మానించారు. అలాగే నిజామాబాద్‌ జిల్లాకు చెందిన రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాయక్‌ వాడి అపర్ణ పాటిల్‌ను సైతం ఆమె సన్మానించారు.

Advertisement