Nuda Chairman | రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి

Nuda Chairman | రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
Nuda Chairman | రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Nuda Chairman | నిజామాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని నుడా ఛైర్మన్​ కేశ వేణు ట్రాఫిక్​ పోలీసులకు సూచించారు. వారితో కలిసి ఆయన బుధవారం నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట ట్రాఫిక్​ ఏసీపీ నారాయణ, ట్రాఫిక్​ సీఐ పబ్బ ప్రసాద్​ తదితరులున్నారు.

Nuda Chairman | ప్రమాదకరంగా యాక్సిడెంట్​ స్పాట్లు

నగరంలోని పలు కూడళ్లు రోడ్డు ప్రమాదాలకు కేంద్రంగా మారాయి. పులాంగ్​ చౌరస్తా, ఎన్టీఆర్​ చౌరస్తా, కంఠేశ్వర్​ బైపాస్​ చౌరస్తా, ఆర్​ఆర్​ చౌరస్తా తదితర ప్రాంతాలు యాక్సిడెంట్​ స్పాట్లుగా మారాయి. ఈ ప్రాంతాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బుధవారం ఉదయం పులాంగ్​ చౌరస్తాలో లారీ, బైకు ఢీకొని ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వరుస ఘటనల నేపథ్యంలో కేశ వేణు స్పందించారు. నగరంలో భవిష్యత్తులో రోడ్డు ప్రమాదాలు జరగకుండా అభివృద్ధి పనులు చేపడుతామని ఆయన పేర్కొన్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  KPHB | మద్యం మత్తులో యువతి బీభత్సం