అక్షరటుడే, వెబ్‌డెస్క్: Steve Smith : ఆస్ట్రేలియా కెప్టెన్ స్టివ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో మ్యాచ్‌లో భారత్ ఓడిన మరుసటి రోజే స్మిత్ వన్డేలకు గుడ్ బై చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఆసీస్ ఓడిన గంటల వ్యవధిలోనే స్మిత్ రిటైర్ మెంట్ ప్రకటించాడు. 35 ఏళ్ల స్టీవ్ స్మిత్ టీం మిడిల్ ఆర్డర్లో వచ్చి ఎన్నో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఛాపియన్స్ ట్రోఫీలో చివరి వన్డే మ్యాచ్ టీమిండియాతో ఆడాడు. ఈ మ్యాచ్‌లో 73 పరుగులు చేశాడు.
Steve Smith : ఇదే సరైన సమయం
వన్డే ఫార్మాట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన స్మిత్.. టెస్ట్ క్రికెట్, టీ20 టోర్నీలలో యథావిధిగా కొనసాగనున్నాడు. వన్డేల్లో రిటైర్మెంట్ ప్రకటిస్తూ మాట్లాడాడు.. రెండు వరల్డ్ కప్స్ గెలిచి ఎన్నో జ్ఞాపకాలను పోగేసుకున్నానన్నారు. 2027 వన్డే వరల్డ్ కప్‌నకు నాయకత్వం వహించడానికి సమర్థులకు ఇది సరైన అవకాశమని చెప్పుకొచ్చారు. వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నానని స్మిత్ పేర్కొన్నారు.
Steve Smith : స్మిత్ వన్డే రికార్డులు
మ్యాచ్‌లు – 170
సెంచరీలు – 12
హాఫ్ సెంచరీలు – 35
అత్యధిక వ్యక్తిగత స్కోర్ – 164(న్యూజిలాండ్‌తో..)
వికెట్లు – 28
క్యాచ్‌లు – 90