అక్షరటుడే, బాన్సువాడ: Ration Shops | చౌక ధరల దుకాణాల్లో స్టాక్ వివరాల పట్టికను విధిగా ప్రదర్శించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Collector Rajiv Gandhi Hanumanthu) ఆదేశించారు. గురువారం వర్ని మండలం జలాల్పూర్లో రేషన్ దుకాణాన్ని(Ration shop) ఆకస్మికంగా తనిఖీ చేశారు. లబ్దిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న తీరును పరిశీలించారు. మొత్తం ఎన్ని కుటుంబాలు ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నాయని, ఇప్పటివరకు ఎంతమందికి బియ్యం పంపిణీ పూర్తయ్యిందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రేషన్ దుకాణం(Ration shop)లో బియ్యం నిల్వలు, నాణ్యతను పరిశీలించారు. స్టాక్ వివరాల పట్టిక కనిపించకపోవడంతో కలెక్టర్(Collector) అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రేషన్ దుకాణాల్లో విధిగా స్టాక్ పట్టిక వివరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని డీఎస్వో అరవింద్ రెడ్డి(DSO Arvind Reddy)ని ఆదేశించారు. సన్నబియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు, అవకతవకలకు తావులేకుండా పకడ్బందీ పర్యవేక్షించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్ రెడ్డి, సివిల్ సప్లయ్స్ డీఎం శ్రీకాంత్ రెడ్డి, డీసీవో శ్రీనివాస్, స్థానిక అధికారులు ఉన్నారు.