అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీల్లో రోజంతా ఒడుదొడుకులు కొనసాగాయి. చివరికి సెన్సెక్స్‌ 1.59 పాయింట్ల లాభంతో 81,510 వద్ద, నిఫ్టీ తొమ్మిది పాయింట్ల నష్టంతో 24,610 పాయింట్లు వద్ద క్లోజ్‌ అయ్యాయి. నిఫ్టీ ఫిఫ్టీలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, విప్రో, హెచ్సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ టాప్‌-5 గెయినర్లుగా నిలవగా.. నష్టపోయిన టాప్‌ 5 కంపెనీల్లో ఎయిర్‌టెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఉన్నాయి.