అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం సెన్సెక్స్ 162 పాయింట్లు, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లలో వోలటాలిటీ కొనసాగుతోంది. ఉదయం 11.15 గంటల ప్రాంతంలో ఇండెక్స్ లు ప్లాట్ గా ఉన్నాయి. ఎయిర్ టెల్, ట్రెంట్, ఓఎన్జీసీ, సన్ ఫార్మా, ఐసీఐసీఐ, టాటా స్టీల్, రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి స్టాక్స్ లాభాల బాటలో ఉండగా బ్రిటనియా, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఆసియన్ పెయింట్స్, ఐచర్ మోటార్స్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్ వంటి స్టాక్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.