అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఫ్లాట్ గా ముగిశాయి. ఇంట్రాడేలో ఒక దశలో సెన్సెక్స్ 485 పాయింట్లు, నిఫ్టీ 144 పాయింట్లు నష్టపోయినా ఆ తర్వాత లాభాల బాట పట్టాయి. కనిష్ట స్థాయిల నుంచి సెన్సెక్స్ 1101 పాయింట్లు, నిఫ్టీ 332 పాయింట్లు పెరిగాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు మళ్లీ పడిపోయాయి. చివరికి సెన్సెక్స్ 9.83 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 6.9 పాయింట్ల నష్టంతో ముగిశాయి. పవర్ గ్రిడ్, హెచ్ ఎల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఆక్సిస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఐసీఐసీఐ, హిందాల్కో, మారుతి వంటి షేర్లు లాభపడగా ఆసియన్ పెయింట్స్, బ్రిటనియా, అపోలో హాస్పిటల్స్, సిప్లా, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైన్సర్వ్, రిలయన్స్ నష్టపోయాయి.