అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 494 పాయింట్లు, నిఫ్టీ 221 పాయింట్లు నష్టపోయాయి. నిఫ్టీ 50లో ఐటీ స్టాక్స్ తో పాటు ఎస్బీఐ, రిలయన్స్, ఎల్&టీ స్టాక్స్ లాభపడ్డాయి. బజాజ్ ఆటో 12.89 శాతం నష్టపోయింది. ఎం&ఎం, మారుతి, టాటా మోటార్స్ వంటి ఆటో షేర్లూ నష్టాల బాటలో పయనించాయి.