అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లలో పతనం ఆగడం లేదు. సోమవారం ఉదయం సెన్సెక్స్ 283 పాయింట్లు, నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్ ఇంట్రాడేలో గరిష్టంగా 615 పాయింట్లు, నిఫ్టీ 182 పాయింట్లు పడిపోయాయి. ఆ తర్వాత కాస్త తేరుకొని ఉదయం 11:45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 341 పాయింట్లు, నిఫ్టీ 104 పాయింట్ల నష్టంతో కదలాడుతున్నాయి. హిందాల్కో, హీరో మోటార్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, టాటా స్టీల్ లాభాలతో, డాక్టర్ రెడ్డి, అపోలో హాస్పిటల్స్, సిప్లా, ఇన్ఫోసిస్, ఎల్టీఐఎం, టీసీఎస్, బీపీసీఎల్, విప్రో, హెచ్ సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ ఎఫ్ డీ లైఫ్, రిలయన్స్ భారీగా నష్టాలతో కొనసాగుతున్నాయి.