అక్షరటుడే, వెబ్ డెస్క్: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ఇన్వెస్టర్లను మురిపించాయి. ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమై మధ్యాహ్నం వరకు ఒడిదుడుకుల్లో కొనసాగినా ఆ తర్వాత లాభాల బాట పట్టాయి. బ్యాంకు షేర్లతో పాటు ఫైనాన్స్, పీఎస్ యూ, మెటల్, ఆటో స్టాక్స్ ఇండెక్స్ లను పరుగులు పెట్టించాయి. బజాజ్ ఆటో, జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, హిందాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆక్సిస్ బ్యాంకు, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఎస్ బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్ స్టాక్స్ భారీగా లాభపడగా.. కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ట్రెంట్, ఆసియన్ పెయింట్స్, దివిస్ ల్యాబ్, ఐటీసీ వంటి స్టాక్స్ నష్టపోయాయి.