Advertisement

అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట వీధి వ్యాపారులు బుధవారం సాయంత్రం ఆందోళనకు దిగారు. అనంతరం మున్సిపల్‌ కమిషనర్‌ ఛాంబర్‌ను ముట్టడించారు. రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన తోపుడు బండ్లు, వీధి వ్యాపారాలను తొలగించడంపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫయాజ్‌, పార్టీ నాయకులు, వీధి వ్యాపారులు పాల్గొన్నారు.

Advertisement