Nizamabad Collector | సాంఘిక బహిష్కరణలు విధించే వీడీసీలపై కఠిన చర్యలు: కలెక్టర్

Nizamabad Collector | సాంఘిక బహిష్కరణలు విధిస్తే వీడీసీలపై కఠిన చర్యలు
Nizamabad Collector | సాంఘిక బహిష్కరణలు విధిస్తే వీడీసీలపై కఠిన చర్యలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad Collector | గ్రామాల్లో వీడీసీల పేరిట సాంఘిక బహిష్కరణలు విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు Collector Rajiv Gandhi Hanmantu అన్నారు. నగరంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్‌లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే జయంతి Mahatma Jyotiba Phule Jayanti వేడుకలు నిర్వహించారు.

Advertisement

ఈ సందర్భంగా మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్‌ ఈరవత్రి అనిల్ Eravatri Anil, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్, బీసీ సంఘాల BC associations ప్రతినిధులతో కలిసి జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ.. పూలే సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి ముందు వినాయక్‌ నగర్‌ హనుమాన్‌ జంక్షన్‌ వద్ద పూలే విగ్రహానికి అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ Urban MLA Dhanpal Suryanarayana పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారిణి స్రవంతి, సహాయ అధికారి నర్సయ్య, గైని గంగారాం, ఆంజనేయులు, నరాల సుధాకర్, వినోద్‌ కుమార్, రవీందర్, సాయిలు, రాజేశ్వర్, శంకర్, రాములు, షేక్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

Advertisement