అక్షరటుడే, బాన్సువాడ: Kalthi Kallu | జిల్లాలో కల్తీకల్లు(Kalthi Kallu) తయారీదారులపై కఠినచర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas Reddy) అధికారులను ఆదేశించారు. బాన్సువాడ ఆస్పత్రి(Banswada Hospital)లో చికిత్స పొందుతున్న కల్తీకల్లు బాధితులను ఆయన ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్(Agro Industries Chairman) కాసుల బాలరాజ్(Kasula Balaraju)తో కలిసి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని ఆరాతీశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎక్సైజ్ శాఖ(Excise Department) అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్తీకల్లు(Kalthi Kallu) కూడా డ్రగ్స్(Drugs)లో భాగమేనని, ప్రజలు ఇలాంటి కల్తీ కల్లుకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి(Sub-Collector Kiranmayi), ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.