అక్షరటుడే, వెబ్డెస్క్: Relations | ఈ రోజుల్లో మానవ సంబంధాలు Relations క్రమక్రమంగా కనుమరుగవుతున్నాయి. ఒకప్పుడు సమాజంలో society ఎవరికైనా ఆపదవస్తే ఒకరికి ఒకరు తోడుగా ఉండేవారు. కాని మనకెందుకులే అనుకునే సంస్కృతి సమాజంలో society పెరిగిపోయింది.
వ్యక్తి ఎంత సేపు ఆర్థిక సంబంధాల కోసం మాత్రమే మానవ సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. పెద్ద వాళ్లతో పాటు పిల్లలలో కూడా బంధాలు Bonds మసకబారుతున్నాయి. ఇందుకు వరుస ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Relations | అసలు ఎందుకిలా?
అన్నదమ్ముల్లో sibling ఒకరి పుట్టినరోజు ఇంకొకరు సోషల్ మీడియా social media ద్వారా శుభాకాంక్షలు చెప్పుకోవడం, దగ్గరి స్నేహితుల్లో ఒకరి ఇంట్లో పెండ్లి ఉంటే పెండ్లి కార్డు వాట్సప్ గ్రూప్‌లో WhatsApp groups పెట్టడం ఇలా రోజు రోజుకి ఆప్యాయతలు తగ్గిపోయాయి. పెద్ద వాళ్లని చూసి పిల్లలలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఇంట్లో వాతావరణం atmosphere పిల్లలపై Kids చాలా ఎఫెక్ట్ పడుతుందన్న దానికి తాజా సంఘటనే ఉదాహరణ.
నాలుగో తరగతి చిన్నారి fourth-grade child తనకు వచ్చిన ప్రశ్నకు రాసిన జవాబును చూస్తే సమాజం ఎటు పోతుందో మనకి అర్ధమవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా Rajanna Sircilla district చందుర్తి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి వార్షిక పరీక్షల్లో annual exams భాగంగా ఆంగ్ల ప్రశ్నపత్రంలో English question paper అమ్మకు నచ్చేవి.. నచ్చని వాటి గురించి ఓ ప్రశ్న అడిగారు.
దీనికి సదరు చిన్నారి ‘అమ్మకు నచ్చనిది నానమ్మ – తాతయ్య’ grandmother and grandfather అని ఆంగ్లంలో రాయడం పేపర్ దిద్దిన ఉపాధ్యాయుడు teacher సైతం ఆశ్చర్యానికి లోనుకావడం జరిగింది. నేటి సమాజానికి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు, అత్తమామలు భారంగా మారారని, వారి పట్ల ప్రేమ ఎలా ఉన్నదో సదరు విద్యార్థి Student సమాధానం ద్వారా అర్థమవుతుంది. మానవ సంబంధాలు ఎంత నాశనం అయ్యాయో చెప్పడానికే ఈ జవాబు చక్కని ఉదాహరణ అని సదరు ఉపాధ్యాయుడు పేర్కొన్నాడు. ప్రస్తుతం పేపర్ కటింగ్ నెట్టింట వైరల్ అవుతుంది.