అక్షరటుడే, ఇందూరు: నగరంలోని దుబ్బలో కల్లుబట్టికి ఎదురుగా ఉన్న గీర్వాణి పాఠశాల అనుమతి రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సంఘం జిల్లా కార్యదర్శి జ్వాల డిమాండ్ చేశారు. ఈ విషయమై మంగళవారం డీఈవో దుర్గాప్రసాద్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ విషయమై గతంలోనే ఎంఈవోకు విన్నవించినా స్పందించలేదన్నారు. వెంటనే పాఠశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.