Hanamakonda | విద్యార్థినులే టార్గెట్​.. డ్రగ్స్​ ఇచ్చి అఘాయిత్యం

Hanamakonda | విద్యార్థినులే టార్గెట్​.. డ్రగ్స్​ ఇచ్చి అఘాయిత్యం
Hanamakonda | విద్యార్థినులే టార్గెట్​.. డ్రగ్స్​ ఇచ్చి అఘాయిత్యం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hanamakonda | పాఠశాలకు వెళ్లే విద్యార్థినులను కిడ్నాప్​ చేసి, డ్రగ్స్​ ఇచ్చి అత్యాచారాలకు పాల్పడుతోంది ఓ ముఠా. బాలికలను కిడ్నాప్​ చేసి డ్రగ్స్​ ఇచ్చి మానవ మృగాలకు అప్పగిస్తుంది. అనంతరం బాలికలు స్పృహలోకి రాగానే తిరిగి వదిలేస్తున్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంగా ఓ కిలాడీ లేడీ నడిపిస్తున్న ఈ తతంగం తాజాగా వెలుగు చూసింది. హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన సదరు కిలాడీ లేడీ వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలో నివాసముంటోంది.

Hanamakonda | డ్రగ్స్​కు బానిసై..

డ్రగ్స్‌కు బానిసైన ఆ లేడీ.. తనతో పాటు డ్రగ్స్‌కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడింది. పాఠశాల బాలికలే లక్ష్యంగా ఈ లేడీ వరంగల్​లోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తుంది. పాఠశాలకు వెళ్లివచ్చే సమయాల్లో బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతుంది. అనంతరం వారిని కిడ్నాప్ చేసి, మత్తు పదార్థాలు ఇస్తుంది.

Hanamakonda | మత్తులో ఉండగానే..

మత్తులోకి జారుకున్న బాలికలను అప్పటికే తన గ్యాంగ్​కు టచ్లో ఉన్న మానవ మృగాలకు ఈ ముఠా అప్పగిస్తోంది. వారు బాలికలు మత్తులో ఉండగానే అత్యాచారాలు చేసేవారు. తిరిగి స్పృహలోకి రాగానే సదరు కిలాడీ లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అక్కడే వదిలేసి వెళ్లిపోయేది. ఇలా.. ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసినట్లు తెలిసింది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోగా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వారి గురించి బయటకు తెలిసింది. సదరు కిలాడీ లేడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement