అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. గురువారం రాత్రి విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. గొడవలో ముగ్గురు విద్యార్థులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. ఎల్లారెడ్డి గురుకుల పాఠశాల వివాదాలకు కేరాఫ్‌గా మారిపోయింది. గతేడాది ఫోన్ల విషయంలో వివాదం ఏర్పడి గొడవకు దారితీసింది. ఉన్నతాధికారులు పాఠశాలను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఈ విధంగా రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థుల మధ్య విభేదాలే గురువారం రాత్రి ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. ఈ ఘటనపై శుక్రవారం జోనల్ అధికారి ఫ్లోరెన్స్ రాణి, తహశీల్దార్ మహేందర్, సీఐ రవీందర్ నాయక్ విచారణ చేపట్టారు.