అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: భువనగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌ను ఇంటర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులు ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.