అక్షరటుడే, కామారెడ్డి: కాలేజీ సమయానికి అనుగుణంగా బస్సులు నడపడం లేదని బేబీపేట మండల కేంద్రంలో శనివారం విద్యార్థులు ధర్నా చేపట్టారు. సకాలంలో బస్సులు రాకపోవడంతో నిత్యం కళాశాలకు ఆలస్యంగా వెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కామారెడ్డి డిపో మేనేజర్ ఇందిరా దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని వాపోయారు. ఉదయం ఏడు గంటల నుంచి ఏడున్నర గంటల మధ్య బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. మండలంలోని ఇస్సానగర్, మల్కాపూర్ గ్రామాలకు బస్సు వేయాలన్నారు. ఈ మేరకు డీఎంకు వినతిపత్రం అందజేశామని తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు.