COLLECTOR : విద్యార్థుల‌కు రుచిక‌ర‌మైన భోజ‌నం అందించాలి
COLLECTOR : విద్యార్థుల‌కు రుచిక‌ర‌మైన భోజ‌నం అందించాలి
Advertisement

అక్ష‌ర‌టుడే, నిజామాబాద్ సిటీః COLLECTOR : విద్యార్థుల‌కు రుచిక‌ర‌మైన భోజ‌నం అందించే బాధ్య‌త పాఠ‌శాల సిబ్బందిదేన‌ని క‌లెక్ట‌ర్ రాజీవ్​గాంధీ హనుమంతు(COLLECTOR RAJIV GANDHI HANUMANTHU) పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం మెండోరా(MENDORA) మండ‌లం పోచంపాడ్‌లోని సోష‌ల్ వెల్ఫేర్ బాలిక‌ల రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌/కళాశాలను, పీహెచ్​సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సాంఘిక సంక్షేమ పాఠశాలలో కిచెన్ కం డైనింగ్ హాల్, స్టోర్ రూం డార్మెటరీలను సందర్శించి వంట సామ‌గ్రిని, స్టాక్ రిజిష్టర్ తనిఖీ చేశారు. ప్రహరీతో కూడిన సువిశాలమైన పాఠశాల ఆవరణను గమనించిన కలెక్టర్, ప్లే గ్రౌండ్ గురించి ఆరా తీశారు. అర్థాంతరంగా నిలిచిపోయిన ల్యాబ్ గదుల నిర్మాణాలను పూర్తి చేయించేందుకు తక్షణమే ప్రతిపాదనలు పంపాలని నిర్వాహకులను ఆదేశించారు. కిచెన్‌లో నిరుపయోగంగా ఉన్న స్టీమ్ యూనిట్‌ను వినియోగంలోకి తేవాలని, 500 విద్యార్థినుల‌కు శుచి, శుభ్ర‌త‌తో కూడిన భోజ‌నం పెట్టాల‌ని సూచించారు.

COLLECTOR : పీహెచ్‌సీ త‌నిఖీ

అనంతరం కలెక్టర్ పోచంపాడ్(POCHAMPAD) ఆస్ప‌త్రిలోని ఆయా విభాగాలను సందర్శించి, రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును గమనించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. వార్డులను సందర్శించి రోగులకు కల్పిస్తున్న సదుపాయాలను గమనించారు. బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తూ, మధుమేహం, టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధుల నిర్ధారణ, వాటి బారిన పడిన వారికి అందిస్తున్న చికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల ఇన్‌ఛార్జి జోనల్ ఆఫీసర్ పూర్ణచందర్, స్కూల్ ప్రిన్సిపాల్ గోదావరి, పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాకేశ్ తదతరులు ఉన్నారు.

Advertisement