అక్షరటుడే, కామారెడ్డి గ్రామీణం: Collector | పదో తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయం వీడి, ఉత్తమ మార్కులు సాధించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. భిక్కనూర్ మండలం జంగంపల్లిలోని ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన కంటి వైద్యశిబిరంలో దృష్టిలోపం ఉన్న విద్యార్థినులకు కళ్ల అద్దాలు పంపిణీ చేసి మాట్లాడారు.
ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం కంటి వైద్యపరీక్షలు జరిపి, కంటి అద్దాలు అందిస్తోందన్నారు. అనంతరం పాఠశాలలో కిచెన్, స్టోర్‌రూం పరిశీలించారు. నూతన మెనూ ప్రకారం భోజనం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆయన వెంట డీఎంహెచ్వో చంద్రశేఖర్, కంటి వైద్యుడు రవీందర్, ఆర్‌బీఎస్‌కే వైద్యుడు మనోజ్, మెడికల్ ఆఫీసర్ విజయ మహాలక్ష్మి, ప్రిన్సిపాల్ విమలా దేవి, తహశీల్దార్ శివప్రసాద్, ఎంపీడీవో రవికిరణ్ పాల్గొన్నారు.