అక్షరటుడే, ఇందూరు:Chandrasekharendra Saraswati University | విద్యార్థులు చిత్తశుద్ధితో విద్యను అభ్యసించాలని చంద్రశేఖరేంద్ర సరస్వతీ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీనివాస్(Vice Chancellor Srinivas) అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని గంగస్థాన్(Gangasthan)లోని ఉత్తర తిరుమల దేవాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమిళనాడులోని కాంచీపురం పుణ్యక్షేత్రంలో 1993 నుంచి విశ్వవిద్యాలయం (University) కొనసాగుతుందన్నారు. విజయేంద్ర సరస్వతి స్వామి(Vijayendra Saraswati Swami) దివ్య సూచనలతో విద్యాలయం ముందుకు సాగుతుందన్నారు. 28 ఏళ్లుగా ఎందరో విద్యార్థులను ఈ విద్యాలయం ఉత్తమంగా తీర్చిదిద్దిందని గుర్తు చేశారు. ఇంజనీరింగ్(engineering)లోని అన్ని విభాగాలు శాస్త్ర సాంకేతిక, మేనేజ్మెంట్, వైద్య విజ్ఞాన శాస్త్రంకే కాకుండా వైద్య అనుబంధ సేవా శాస్త్రం కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. న్యాయ శాస్త్రం, ఇతర సాంఘిక సాంస్కృతిక భాషా శాస్త్రంలు డిగ్రీ, పీజీ పరిశోధన స్థాయిలో అందిస్తామన్నారు.
బాల బాలికలకు వేరువేరుగా వసతి గృహాలు, ఆరోగ్యకరమైన శుద్ధ శాకాహారంతో అందిస్తున్నామన్నారు. సుమారు 50 ఎకరాల సువిశాల పచ్చని ప్రశాంత పరిసరాలతో ప్రతి విభాగానికి ప్రత్యేక భవనాలు(Special buildings) ఉన్నాయన్నారు. ఈ సదవకాశాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. L ప్రొఫెసర్ వెంకట రమణ పాల్గొన్నారు.