Advertisement
అక్షరటుడే, ఇందూరు: గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాలకు చెందిన విద్యార్థులు మంగళవారం మెడికల్ కళాశాల, జీజీహెచ్లను సందర్శించారు. జీజీహెచ్లో డయాగ్నస్టిక్, ల్యాబ్, వైరాలజీ సెంటర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, మైక్రో బయాలజీ విభాగాధిపతి డాక్టర్ ముత్తెన్న, బయో కెమిస్ట్రీ విభాగాధిపతి చంద్రశేఖర్, బయోటెక్నాలజీ విభాగాధిపతి నరేష్, రమ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement