అక్షరటుడే, బాన్సువాడ: Inter Exams : మండలంలోని తాడ్కోల్ శివారులో ఉన్న ఠాగూర్ జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని గురువారం సబ్ కలెక్టర్ కిరణ్మయి గురువారం పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని సూచించారు. కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Inter Exams : నర్సరీలో మొక్కలను పర్యవేక్షించాలి
ఉపాధి హామీ నర్సరీల్లో మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశించారు. మండలంలోని తాడ్కోల్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం, నర్సరీ, అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించారు. అంగన్వాడీలో చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో బషీరుద్దీన్, ఎంపీవో సత్యనారాయణరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.