అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూర్ బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బీర్కూర్ మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించి ప్రిన్సిపాల్ పై మండిపడ్డారు. మరుగుదొడ్లలో బ్లీచింగ్ వేసి శుభ్రం చేయకుండా ఎలా వదిలేస్తారని మండిపడ్డారు. వంటశాల, తరగతి గదులను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ.. ఇష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని సూచించారు.