అక్షరటుడే, నిజాంసాగర్​: మండలంలోని అచ్చంపేట్​ మోడల్​ స్కూల్​ను సబ్​ కలెక్టర్​ కిరణ్మయి గురువారం తనిఖీ చేశారు. మోడల్​స్కూల్​లో ప్రాక్టికల్స్​ నిర్వహిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటగది లేక ఇబ్బందులు పడుతున్నామని, గదిని మంజూరు చేయించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆమెను కోరారు. అనంతరం విద్యార్థులకు ఆమె స్నాక్స్​ అందజేశారు. పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా చదవాలని సూచించారు. ఆమె వెంట తహశీల్దార్ భిక్షపతి, ఎంఈవో తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ కార్తీక సంధ్య తదితరులున్నారు.