అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. శుక్రవారం పట్టణంలోని కల్కి చెరువు పరిసరాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టాని ఆదేశించారు. ఆమె వెంట తహశీల్దార్ వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, ఇరిగేషన్, విద్యుత్ అధికారులు ఉన్నారు.
Advertisement
Advertisement