అక్షరటుడే, బోధన్: కులగణన సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు ప్రజలు సహకరించాలని సబ్ కలెక్టర్ వికాస్ మహతో కోరారు. బోధన్ డివిజన్లో ఇప్పటి వరకు 93 శాతం సర్వే పూర్తయిందని తెలిపారు. మిగతా సర్వేను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. డివిజన్లో గురువారం నుంచి డాటా ఎంట్రీ ప్రారంభించామని తెలిపారు. ఇందుకోసం డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.