Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండలంలోని కళ్యాణి గ్రామ శివారులో పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు. గ్రామ శివారులోని పోచమ్మ గుడి సమీపంలో పేకాడుతున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు జరిపారు. ఐదుగురిని అరెస్టు చేసి.. వారి నుంచి రూ.7 వేల నగదు, రెండు బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement