అక్షరటుడే, భీమ్‌గల్: Sand mining | మండలంలోని బడా భీమ్‌గల్ శివారులో గల కప్పలవాగు నుంచి బుధవారం ఉదయం అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై జి.మహేశ్ తెలిపారు. అక్కడికి వెళ్లిన పోలీసులను చూసి పారిపోతున్న బడా భీమ్గల్కు చెందిన ట్రాక్టర్ డ్రైవర్లు సదానంద్, పెద్దోళ్ల శ్రీకాంత్, అజయ్, కిషన్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో ఎవరైనా అక్రమంగా ఇసుక, మొరం తరలిస్తే కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement