అక్షరటుడే, కామారెడ్డి: దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు వాటిని ట్రేస్ చేసి అప్పగించినట్లు ఎస్సై రాజు తెలిపారు. మూడు నెలల కాలంలో ఫోన్లు పోగొట్టుకున్న 8 మందికి శనివారం తిరిగి అప్పగించామన్నారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.