Advertisement

అక్షరటుడే, నిజాంసాగర్ : నిజాంసాగర్​ ప్రధాన కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం సోమవారం లభ్యమైనట్లు ఎస్సై శివకుమార్​ తెలిపారు. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్​ గ్రామానికి చెందిన కర్రె విఠల్​ (40) మిషన్​ భగీరథలో హెల్పర్​గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం మహమ్మద్ నగర్​ సమీపంలోని కాలువలో చేపలు పట్టడానికి వెళ్లి విఠల్​ గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నీటి విడుదలను నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టారు. మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ శివారులో ఆయన మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement