Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ తీసుకోవడానికి ఎస్సైలు ముందుకు రావడం లేదు. రెండు నెలల వ్యవధిలో ఠాణాలో విధులు నిర్వహించే ఇద్దరు ఎస్సైలు ఏసీబీకి చిక్కడంతో ఇక్కడ చేరడానికి భయపడుతున్నారు. ఈ పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ కోసం గతంలో ఎస్సైలు పోటీ పడేవారు. కానీ ఇప్పుడు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఇక్కడ పనిచేసిన ఎస్సై గత నెలలో ఏసీబీకి చిక్కడంతో ప్రస్తుతం ఆ పోస్ట్ ఖాళీగా ఉంది.
Advertisement