ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్టార్
ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్టార్
Advertisement

అక్షరటుడే, ఇందూరు: ACB : నిజామాబాద్ అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ఈ దాడుల్లో ఇద్దరు ఉద్యోగులు అవినీతి అధికారులకు చిక్కారు.

అర్బన్ కార్యాలయంలో జాయింట్-2 సబ్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీరామరాజు ఓ వ్యక్తి నుంచి లంచం డిమాండ్ చేశారు. ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ జరిపేందుకు ఒక్కో దానికి రూ.10 వేలు లంచంగా అడిగారు. చేసేదేమీ లేక బాధితుడు లంచం ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.

అయితే సోమవారం రిజిస్ట్రేషన్ చేస్తానని సబ్ రిజిస్ట్రార్ ఒప్పందం చేసుకున్నాడు. తీరా లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా పథకం ప్రకారం ఏసీబీ అధికారులు సోమవారం ఉదయం రైడ్ చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  ACB RAIDS | ఏసీబీకి చిక్కిన మున్సిపల్​ ఆర్​ఐ

ఈ నేపథ్యంలో సోమవారం కార్యాలయంలోని స్వీపర్ వెంకట్రావుకు లంచం ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ రామరాజు సూచన మేరకు లంచం తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో సబ్ రిజిస్ట్రార్ రామరాజు, వెంకట్రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు.

Advertisement