Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ వివాదాస్పద స్కిట్.. మండిపడుతున్న హిందూ సంఘాల నేతలు

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ వివాదాస్పద స్కిట్.. మండిపడుతున్న హిందూ సంఘాల నేతలు
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ వివాదాస్పద స్కిట్.. మండిపడుతున్న హిందూ సంఘాల నేతలు

అక్షర టుడే, వెబ్ డెస్క్ Sudigali Sudheer : పాత‌కాలం నాటి భామ‌లు ఒక్కొక్క‌రుగా బుల్లితెర‌కి ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. కొంద‌రు వెండితెర‌పై రీఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా బుల్లితెరపై ఓ రియాల్టీ షోలో హీరో జేడీ చక్రవర్తితో కలిసి సందడి చేసింది అందాల రాశి రంభ. ఒకప్పుడు వరుస సినిమాలతో సత్తా చాటిన రంభ.. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ప్రస్తుతం భర్త, పిల్లలతో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫ్యామిలీ ఫోటోస్ పంచుకుంటుంది. రంభ‌ ఆల్రెడీ తమిళ్ టీవీ షోలతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తెలుగులో కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. రంభ సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ షోలో ఓ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేసారు.

Advertisement

ఇందులో రంభకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రంభతో పాటు బొంబాయి ప్రియుడు సినిమాలో నటించిన JD చక్రవర్తి కూడా ఈ షోకి హాజ‌రై సందడి చేసాడు. అలాగే సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) కూడా ఈ షోకి వచ్చి అలరించాడు. సుధీర్ (Sudigali Sudheer) అయితే రంభ కోసం ఓ పాట కూడా పాడాడు. రంభ ఈ షో లో తెలుగులో మాట్లాడింది. అలాగే రంభ డ్యాన్స్ కూడా వేసి అలరించింది. సుధీర్ తో కలిసి బావగారు బాగున్నారా సినిమాలో ఓ సీన్ ని స్కిట్ లా వేశారు. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

అయితే బావగారు బాగున్నారా సినిమా సీన్ ను రీక్రియేట్ చేయ‌డంలో భాగంగా నంది కొమ్ముల్లో నుంచి చూస్తే రంభ కనిపించేలా సీన్ ఉంటుంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో (Social media) వైరల్ అవుతుంది. అయితే సుడిగాలి సుధీర్ స్కిట్ పై హిందూ సంఘాల నేతలు మండిప‌డుతున్నారు. దేవుడంటే కొంచెం కూడా భ‌యం లేదు. శివుడితో (lord shiva) పరాచకాలా అంటూ ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రి దీనిపై వారు ఏమైన స్పందిస్తారా లేదా అన్న‌ది చూడాలి.

Advertisement