అక్షరటుడే, ఇందల్వాయి: indalwai | మానసిక స్థితి బాగాలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై మనోజ్‌కుమార్(si manoj kumar) తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చంద్రాయన్పల్లి(Chandrayanpalli)కి చెందిన తూర్పు రాజన్న(48) ఇటీవల గల్ఫ్(gulf) నుంచి తిరిగివచ్చాడు. అప్పటినుంచి మానసిక పరిస్థితి బాగాలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడు. మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement