అక్షరటుడే, నిజామాబాద్ రూరల్: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అర్సపల్లికి చెందిన సుజాతకు అదే గ్రామానికి చెందిన రవితో కొన్నేళ్ల క్రితం వివాహం కాగా వారికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే సుజాత తరచూ తన భర్తతో గొడపడుతుండేది. మంగళవారం రాత్రి పక్కింటి వాళ్లతో కూడా గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. భర్త ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. బుధవారం రైల్వే స్టేషన్‌మాస్టర్ సమాచారం మేరకు అర్సపల్లి గేట్ సమీపంలో సుజాత మృతదేహం లభ్యమైందని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement