Advertisement

అక్షర టుడే, వెబ్ డెస్క్ : Sukumar | టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ Ram Charan – క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ Sukumar కాంబోలో సినిమా అంటే ఆడియన్స్ అంచ‌నాలు ఓ లెవెల్ ఉంటాయి. రంగస్థలం మూవీతో గ‌తంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ కాంబో మరోసారి కలిసి పనిచేయనున్నారు. పుష్పా భారీ విజ‌యం తర్వాత రామ్ చ‌రణ్‌తో సుకుమార్ మరో సినిమాను తెర‌కెక్కించనున్నాడు. బన్నీతో ఫుల్ మాస్ లెవెల్ సినిమా తెరకెక్కించిన సుకుమార్ చరణ్ కోసం స్టైలిష్ యాక్షన్ డ్రామా ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఈ మూవీపై చరణ్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాడట. ఇప్పటికే సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని టాక్. ప్రస్తుతం చరణ్ ఆర్సీ 16తో బిజీ ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి ఆర్సీ 17 సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  Samantha : సమంతకు వ్యాధి మళ్లీ తిరగబెట్టిందా.. హాస్పిటల్​లో సెలైన్ ఎక్కుతున్న ఫొటో వైరల్​

పుష్ప 2 (Pushpa 2) సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకున్న దర్శకుడు సుకుమార్ (Sukumar). ఆయన చేసిన ప్రతి సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పిస్తూ ముందుకు సాగుతుంద‌ని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే వరుసగా మూడు సినిమాలతో సూపర్ సక్సెస్ ను అందుకున్న సుకుమార్ ఇప్పుడు రామ్ చరణ్ (Ram Charan)తో చేయబోయే సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు రాబోతున్న సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్క‌నుంది.

Advertisement