అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో police department విద్యార్థినులకు female students వేసవికాల ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు సీపీ సాయి చైతన్య CP Sai Chaitanya పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
9వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థినులకు సెల్ఫ్ డిఫెన్స్‌పై self-defense ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నారు. నగర శివారులోని ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలలో RBVRR school ఈనెల 25వ తేదీ నుంచి మే5 వరకు శిబిరం నిర్వహిస్తామని వెల్లడించారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12వరకు శిక్షణ ఉంటుందని చెప్పారు.
అత్యవసర పరిస్థితుల్లో emergency situations యువతులు తమనుతాము రక్షించుకునేందుకు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. ఆసక్తి గల విద్యార్థినులు తమ పేర్లను ఈనెల13వ తేదీ నుంచి 24వరకు 90009 94312లో నమోదు చేసుకోవచ్చని సూచించారు.