అక్షర టుడే, వెబ్ డెస్క్ Badam Milk : ఎండాకాలం వచ్చిందంటే ప్రజలు జ్యూస్ లవైపు ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. చల్ల చల్లని పానీయాలు తాగితే గాని ఎండ నుంచి ఉపశమనం పొందుతారు. ఈ సమ్మర్లో ఎక్కువగా ద్రవపదార్థాలను తాగుతూ ఉంటారు. ఎండాకాలంలో అధిక వేడినీ భరించలేక జ్యూస్లని ఎక్కువగా తాగుతుంటారు. అలాంటి జ్యూస్ లో బాదం పాలు కూడా ముఖ్యమైనవి.ఈ బాదం పాలని ఎక్కువగా ఇష్టంగా తాగుతుంటారు. ఎంతో రుచిగా కూడా ఉంటుంది. బాదంపప్పుని నీటిలో నానపెట్టి మెత్తగా గ్రైండ్ చేసి వడకట్టి తయారు చేసే ఆరోగ్యకరమైన డ్రింక్. ఈ బాదంపాలని ఆవుపాల నుంచి ప్రత్యామ్నాయం మాత్రమే కాకుండా, ఆ పోషకాలు అందించేది కూడా. ఈ బాదంపాలలో ఖనిజాలు, విటమిన్లు, విటమిన్ -ఇ ,శరీరానికి అవసరమైన శక్తిని అందించగలరు.
బాదం పాలలోని పోషకాలు : ఈ బాదంపాలలో అధికంగా కాల్షియం ఉంటుంది. ఎముకలు బలంగాను, దంతాలను ఆరోగ్యంగానే ఉంచుతుంది. ఎముకలు పేలుసుబారకుండా బలహీనం కాకుండా నివారించబడుతుంది. బాదం పాలలో మెగ్నీషియం, కండరాల దృఢత్వాన్ని పెంచడంలోనూ, నాడీ వ్యవస్థ సముతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇంకా రక్తంలోని చక్కర స్థాయిలో నియంత్రించడంలో కూడా తోడ్పడుతుంది.
- బాదం పాలలో పాస్ఫరస్ సమృద్ధిగా ఉంటుంది. ఈ పాలు కణాల పెరుగుదలను, మరమ్మత్తుల కోసం ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిల్లలకు, వృద్దులకు చాలా మంచిది.
- యాంటీ ఆక్సిడెంట్లు బాదం పాలలో ఎక్కువగా ఉంటాయి.
- విటమిన్- ఇ,బాదంపాలలో అధికంగా ఉంటాయి. శక్తివంతమైన ఆంటీ ఆక్సిడెంట్ గా కూడా పని చేస్తుంది. ఇంకా, కణాలను నష్టాన్ని గురికాకుండా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచడానికి కీలకపాత్ర పోషిస్తుంది.
మధుమేహం ఉన్నవారికి బాదంపాలు : బాదంపాలకి ఇన్సులిన్ ను మెరుగుపరిచే గుణం కలిగి ఉంది. బాదంపాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దీనివల్ల రక్తంలో గ్లూకోస్ నియంత్రించబడతాయి. బాదంపాలలో తక్కువ గ్లైసిమికి ఇండెక్స్ ఉండడం చేత రక్తంలో చక్కర స్థాయిలో త్వరగా పెరగనియ్యదు.
కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఉత్తమమైన జ్యూస్ ఎంపిక. ఈ పాలలో ఫైబర్ కూడా అధికంగానే ఉంటుంది. పదార్థాలు కలిగి ఉండడం వలన ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలోని చక్కర స్థాయిలను సమతుల్యం చేయగలదు.
అధిక బరువు ఉన్నవారికి బాదంపాలు : జీర్ణక్రియ మెరుగుపరిచే సహజ ఔషధం. ఈ పాలు జీర్ణ వ్యవస్థను పనితీరును మెరుగుపరచడానికి. ఇంకా, ఆహారంలోని పోషకాలను సరిగ్గా గ్రహించుటకు తోడ్పడుతుంది. తక్కువ కేలరీలు ఉండడంతో బరువు తగ్గటానికి ఇది మంచి ఎంపిక. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇందులో ఉండే సహజ కోవ్వులు,కడుపు నిండిన భావన కలిగించడం ద్వారా దీనివల్ల అధికంగా తినకుండా నిరోధించవచ్చు.
బాదంపాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. సంపూర్ణ ఆరోగ్యాన్ని, రోగ నిరోధక శక్తిని పెంచి, తీరానికి అవసరమయ్యే శక్తిని కూడా అందించగలదు. షుగర్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇది ఉత్తమమైన డ్రింకుగా ఎంపిక చేసుకోవచ్చు. ఈరోజు మీ ఆహారంతో పాటు బాదంపాలను కూడా చేర్చుకున్నట్లైతే మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు.