Sunil Gavaskar : టీమిండియా గెలిచాక 75 ఏళ్ల సునీల్ గ‌వాస్క‌ర్ ఆనంద తాండవం.. వీడియో వైర‌ల్

Sunil Gavaskar : టీమిండియా గెలిచాక 75 ఏళ్ల సునీల్ గ‌వాస్క‌ర్ ఆనంద తాండవం.. వీడియో వైర‌ల్
Sunil Gavaskar : టీమిండియా గెలిచాక 75 ఏళ్ల సునీల్ గ‌వాస్క‌ర్ ఆనంద తాండవం.. వీడియో వైర‌ల్
Advertisement

అక్ష‌ర‌టుడే, వెబ్‌డెస్క్‌ Sunil Gavaskar : భార‌త జ‌ట్టు ఏదైన ట్రోఫీ గెలిస్తే క్రికెట్ అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. పిల్ల‌ల నుండి పెద్ద‌వాళ్ల వ‌రకు అంద‌రు కూడా సెల‌బ్రేష‌న్స్‌ని ఓ రేంజ్‌లో జ‌రుపుకుంటారు. అయితే గ‌త రాత్రి జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ న్యూజిలాండ్‌ను ఓడించి 2025 ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది. టీమిండియా గెలిచిన ఆ క్ష‌ణం అభిమానుల ఆనందం క‌ట్ట‌లు తెంచుకుంది. మాజీ క్రికెట్ దిగ్గ‌జం సునీల్ గ‌వాస్క‌ర్ ఆనందాన్ని ఆపుకోలేక చిందులు వేశారు. తన ప్రత్యేకమైన స్టైల్లో డాన్స్ చేస్తూ ఈ విజయం‌ను జ్ఞాపకార్థంగా మార్చాడు.

Advertisement

Sunil Gavaskar : డ్యాన్స్ అదిరింది..

ఆ స‌మ‌యంలో స్పోర్ట్స్ ప్రెజెంటర్ మాయంతి లాంగర్ కూడా నవ్వును ఆపుకోలేక కంట్రోల్ చేసుకుంది. ఎప్పుడు లేనిది సునీల్ గ‌వాస్క‌ర్ చిన్న పిల్లాడిలా ఇలా చిందులు వేయ‌డం క్రికెట్ ప్ర‌పంచాన్ని కూడా నివ్వెర పోయేలా చేసింది. ప్ర‌స్తుతం సునీల్ గ‌వాస్క‌ర్ డ్యాన్స్ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. నిన్న గెలిచిన జట్టులో తాను కూడా ఒక సభ్యుడినే అన్నంత జోష్ గవాస్కర్ ప్రతి చర్యలో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత, భారత్ ఈ టైటిల్‌ను మూడుసార్లు గెలుచుకున్న తొలి జట్టుగా నిలిచింది. 2002 – శ్రీలంకతో ఉమ్మడి ఛాంపియన్స్, 2013 – MS ధోని నేతృత్వంలో విజయం, 2025 – రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఛాంపియ‌న్స్ ట్రోఫీ ద‌క్కించుకుంది భార‌త్.

దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో కివీస్‌పై ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే. జ‌ట్టులో రోహిత్ 76 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ (1) ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశపరిచిన‌, శ్రేయస్ అయ్యర్ (48), కేఎల్ రాహుల్ (34*), శుభ్‌మన్ గిల్ (31), అక్షర్ పటేల్ (29), హార్దిక్ పాండ్య (18), రవీంద్ర జడేజా (9*) పరుగులు చేసి టీమిండియా గెలుపుకి బాట‌లు వేశారు. మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో ఓవర్ ఉండగానే ఘన విజయం సాధించింది.