అక్షరటుడే, వెబ్ డెస్క్ : Sunita Williams | అంతరిక్షంలో చిక్కకపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) ఆగమనం మరింత ఆలస్యం కానుంది. ముచ్చటగా మూడోసారి రోదసిలోకి వెళ్లిన సునీతా విలియమ్స్ (Sunita Williams) దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. ఆమెతో పాటు వెళ్లిన బచ్ విల్మోర్ (Butch Wilmore) కూడా అక్కడే చిక్కుకుపోయారు.
వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు ఈనెల 12న నాసా-స్పేస్‌ఎక్స్‌లు చేపట్టాల్సిన క్రూ 10 మిషన్ కూడా వాయిదా పడింది.
అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ తో బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ సిద్ధమయ్యాక, సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం ఆగిపోయింది. హైడ్రాలిక్ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నం కావడంతో మిషన్ ఆపేసినట్లు నాసా (NASA) ప్రకటించింది. సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరోసారి ప్రయోగించనున్నట్లు నాసా వెల్లడించింది.
Sunita Williams | ఎలా చిక్కుకుపోయారంటే..
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్’లో సునీతా విలియమ్స్ ఐఎస్‌ఎస్ (ISS)కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం సునీతా విలియమ్స్ (Sunita Williams), బచ్ విల్మోర్ ఐఎస్‌ఎస్ కు పది రోజుల కోసం వెళ్లారు. ఆ తర్వాత వారు భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, జూన్ 14వ తేదీన వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సి ఉండగా, స్టార్‌లైనర్ వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో వ్యోమగాములు లేకుండానే అంతరిక్ష నౌక భూమికి చేరుకుంది. అలా వారు అంతరిక్షంలో చిక్కుకుపోయారు.
Sunita Williams | ముమ్మర ప్రయత్నాలు..
జూన్ 26న వ్యోమగాములను రప్పించే ప్రయాణాన్ని ఖరారు చేస్తున్నట్లు నాసా ప్రకటించింది. కానీ, ప్రయోగాన్ని వాయిదా వేసింది. సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్ లేకుండానే సెప్టెంబరు 7న బోయింగ్ భూమి మీదకు వచ్చేసింది.
సునీతా విలియమ్స్, బారీ ఇ విల్మోర్ లను తిరిగి భూమి మీదకు తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్‌తో కలిసి నాసా (NASA) పనిచేస్తోంది. వారిని తీసుకురావాలంటే అంతకంటే ముందుగా కొందరిని ఐఎస్‌ఎస్‌కు పంపించాలి. ఈ ప్రయోగం చేపట్టడానికి స్పేస్ ఎక్స్ సమయం తీసుకుంటోంది.
కొన్ని రోజుల క్రితం స్పేస్ నుంచి మీడియాతో సునీత విలియమ్స్, విల్మోర్ మాట్లాడారు. తమకోసం మార్చి 12న స్పేస్‌ఎక్స్‌కు చెందిన క్రూ-10 అంతరిక్షనౌక వస్తుందని, అందులో వచ్చే వ్యోమగాములు తమ బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. మార్చి 19న అదే నౌకలో తాము భూమి మీదకు బయల్దేరతామని చెప్పారు.