
అక్షరటుడే, వెబ్‌డెస్క్ Sunrisers Hyderabad : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ipl 2025 మార్చి 22 నుండి మొదలు కానున్న విషయం తెలిసిందే. మే 18 వరకు 70 లీగ్ మ్యాచ్‌లు జరగనుండగా,ఈ మ్యాచ్‌లు పలు వేదికలలో జరగనున్నాయి.
హైదరాబాద్(ipl hyderabad matches) వేదికగా మార్చి 23, మార్చి 27, ఏప్రిల్ 6, ఏప్రిల్ 12, ఏప్రిల్ 23, మే 5, మే10న సన్ రైజర్స్(sunrisers) మ్యాచులు కొనసాగుతాయి. ప్లే ఆఫ్స్ మే 20 నుంచి మే 25 వరకు నిర్వహించనున్నారు. మార్చి 22నుంచి తెరలేవనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata Night riders), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్లు కోల్ కతా వేదికగా తలపడనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ వేదికగా ఆడనుంది.
Sunrisers Hyderabad : బిజీ షెడ్యూల్..
సన్ రైజర్స్ షెడ్యూల్ చూస్తే.. మార్చి 23: సన్ రైజర్స్ vs రాజస్థాన్ రాయల్స్ – రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (మధ్యాహ్నం 3.30 గంటలకు), మార్చి 27: సన్ రైజర్స్ vs లఖ్ నవూ సూపర్ జెయింట్స్ – రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు), మార్చి 30: సన్ రైజర్స్ vs దిల్లీ క్యాపిటల్స్ – డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియం, వైజాగ్ (మధ్యాహ్నం 3.30 గంటలకు), ఏప్రిల్ 3 సన్ రైజర్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ – ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా (రాత్రి 7.30 గంటలకు), ఏప్రిల్ 6 : సన్ రైజర్స్ vs గుజరాత్ టైటాన్స్ – రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు) జరగనున్నాయి.
ఇక ఏప్రిల్ 12 : సన్ రైజర్స్ vs పంజాబ్ కింగ్స్ – రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు), ఏప్రిల్ 17 : సన్ రైజర్స్ vs ముంబయి ఇండియన్స్ – వాంఖడే స్టేడియం, ముంబయి (రాత్రి 7.30 గంటలకు), ఏప్రిల్ 23 : సన్ రైజర్స్ vs ముంబయి ఇండియన్స్ – రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు), ఏప్రిల్ 25 : సన్ రైజర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ – M.A. చిదంబరం స్టేడియం, చెన్నై (రాత్రి 7.30 గంటలకు), మే 2 : సన్ రైజర్స్ vs గుజరాత్ టైటాన్స్ – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ (రాత్రి 7.30 గంటలకు), మే 5 : సన్ రైజర్స్ vs దిల్లీ క్యాపిటల్స్ – రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు), మే 10 : సన్ రైజర్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ – రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ (రాత్రి 7.30 గంటలకు), మే 13 : సన్ రైజర్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు (రాత్రి 7.30 గంటలకు) , మే 18 : సన్ రైజర్స్vs లఖ్ నవూ సూపర్ జెయింట్స్ – BRSABV ఎకానా క్రికెట్ స్టేడియం, లఖ్ నవూ (రాత్రి 7.30 గంటలకు) జరగనున్నాయి.
