MLC Kavitha | పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలి

MLC Kavitha | పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలి
MLC Kavitha | పసుపు పంటకు మద్దతు ధర ప్రకటించాలి
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | పసుపు రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) డిమాండ్​ చేశారు. శాసన మండలి(counsil) మీడియా పాయింట్​ వద్ద శనివారం బీఆర్​ఎస్(BRS)​ ఎమ్మెల్సీలతో కలిసి ఆమె నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పసుపు పంట క్వింటాలుకు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆమె డిమాండ్​ చేశారు. పేరుకు పసుపు బోర్డు(Turmeric Board) ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరపై ఎటువంటి ప్రకటన చేయలేదన్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

MLC Kavitha | అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్​, బీజేపీ

శాసనమండలిలో కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP) ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారని కవిత ఆరోపించారు. దీని గురించి బీఆర్​ఎస్(BRS)​ ఎమ్మెల్సీలు ప్రశ్నిస్తే ఛైర్మన్ న్యూసెన్స్ చేయవద్దని కామెంట్ చేశారన్నారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఆమె డిమాండ్​ చేశారు. గతంలో కూడా తమ పార్టీ సభ్యులపై ఏకవచనంతో మాట్లాడారన్నారు. శాసనసభ, మండలిలో బీఆర్ఎస్ సభ్యులకు సముచిత స్థానం కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Budget Session | బీఆర్​ఎస్​ నేతలపై సీఎం రేవంత్​రెడ్డి ఆగ్రహం