Suprem Court | బిల్లుల‌పై గ‌డువులోగా నిర్ణ‌యం తీసుకోవాలి.. రాష్ట్ర‌ప‌తికి సుప్రీంకోర్టు సూచ‌న‌..

Suprem Court | రాష్ట్ర‌ప‌తికి సుప్రీంకోర్టు సూచ‌న‌.. బిల్లుల‌పై గ‌డువులోగా నిర్ణ‌యం తీసుకోవాలి
Suprem Court | రాష్ట్ర‌ప‌తికి సుప్రీంకోర్టు సూచ‌న‌.. బిల్లుల‌పై గ‌డువులోగా నిర్ణ‌యం తీసుకోవాలి

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Suprem Court | రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లులపై త‌గిన స‌మ‌యంలో నిర్ణ‌యం తీసుకోవాల‌ని సుప్రీంకోర్టు Supreme Court రాష్ట్ర‌ప‌తికి సూచించింది. అత్యున్న‌త న్యాయ‌స్థానం రాష్ట్ర‌ప‌తికి ఈ త‌ర‌హా సూచ‌న చేయ‌డం ఇదే తొలిసారి. గవర్నర్ Governor పరిశీలన కోసం రిజర్వ్ చేసిన బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి Tamil Nadu Governor RN Ravi రాష్ట్రపతి పరిశీలన కోసం నిలిపివేసిన 10 బిల్లులను సుప్రీంకోర్టు Supreme Court క్లియర్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి సంబంధించిన 415 పేజీల తీర్పు కాపీని సుప్రీంకోర్టు తాజాగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ Ministry of Home Affairs సూచించిన నిర్దేశిత గ‌డువును పాటిచండం సముచితమని కోర్టు భావించింది. మూడు నెలల వ్యవధిలో గవర్నర్ తన పరిశీలన కోసం రిజర్వ్ bills reserved చేసిన బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement
Advertisement

Suprem Court | ఆల‌స్య‌మైతే కార‌ణాలు చెప్పాలి..

బిల్లు ఆమోదానికి passing a bill నిర్దేశిత గ‌డువు దాటితే ఆ విష‌యాన్ని సంబంధిత రాష్ట్ర ప్ర‌భుత్వానికి state governmen తెలియ‌జేయాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం తెలిపింది. నిర్దేశిత‌ వ్యవధి దాటి ఏదైనా ఆలస్యం జరిగితే, తగిన కారణాలను నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియజేయాని సుప్రీంకోర్టు Supreme Court పేర్కొంది. “బిల్లుల ఆమోదం విష‌యంలో రాష్ట్రాలు కూడా సహకరించాలి. లేవనెత్తే ప్రశ్నలకు సమాధానాలు అందించడం ద్వారా సహకారం అందించాలి. అలాగే, కేంద్ర ప్రభుత్వం Central Government చేసిన సూచనలను కూడా పరిగణించాలి” అని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Supreme Court | అలాహాబాద్ హైకోర్టుపై సుప్రీం అసహనం

Suprem Court | సుప్రీంకోర్టుకు రావొచ్చు..

త‌మిళ‌నాడు అసెంబ్లీ Tamil Nadu Assembly ఆమోదించి పంపించిన 10 బిల్లుల‌ను గ‌వ‌ర్న‌ర్ ర‌వి ఆమోదించ‌కుండా తిప్పి పంపించారు. అసెంబ్లీ రెండో సారి ఆమోదించి పంపిన‌ప్ప‌టికీ, గ‌వ‌ర్న‌ర్ Governor ఆమోద‌ముద్ర వేయ‌కుండా రాష్ట్ర‌ప‌తి ప‌రిశీలన‌కు పంపిస్తామ‌ని పేర్కొన్నారు. దీంతో స్టాలిన్ ప్ర‌భుత్వం Stalin government సుప్రీంకోర్టును Supreme Court ఆశ్ర‌యించింది. ఈ పిటిష‌న్‌ను విచారించిన న్యాయ‌మూర్తులు జె.బి. పార్దివాలా J.B. Pardiwala, ఆర్.మహదేవన్​లతో R. Mahadevan కూడిన ధర్మాసనం గ‌వ‌ర్న‌ర్ తీరును త‌ప్పుబ‌ట్టింది. గ‌వ‌ర్న‌ర్ చ‌ర్య చ‌ట్ట విరుద్ధ‌మ‌ని, అసెంబ్లీ రెండోసారి ఆమోదించి పంపిన బిల్లుల‌ను తొక్కిపెట్ట‌డం స‌రికాద‌ని పేర్కొంది. రాష్ట్రపతి పరిశీలన కోసం 10 బిల్లులను కేటాయించడాన్ని పక్కన పెట్టింది. 10 బిల్లులు ఆమోదించిన‌ట్లుగానే భావించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది. గవర్నర్ ఒక బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్ చేస్తే.. రాష్ట్రపతి దానికి అనుమతి ఇవ్వకుండా నిలిపివేసినప్పుడు, ఈ కోర్టు ముందు సవాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంద‌ని సుప్రీంకోర్టు పేర్కొంది.

Advertisement