అక్షరటుడే, వెబ్‌డెస్క్ : దీపావళి తర్వాత ఢిల్లీలో కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉన్న అమలుకావడంలేదని అసహనం వ్యక్తం చేసింది. ఈఏడాది నిషేధాన్ని అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం, పోలీసు కమిషనర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. అలాగే వచ్చే ఏడాది నిషేధం అమలు కోసం ప్రతిపాదిత చర్యలు అందులో పొందుపర్చాలని ఆదేశించింది.