అక్షరటుడే, వెబ్డెస్క్: Supreme Court | అత్యాచారం కేసులో అలాహాబాద్ హైకోర్టు Allahabad High Court ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు judges వ్యాఖ్యలు చేసే సమయంలో అత్యంత జాగ్రత్తగా extremely careful ఉండాలని హితవు పలికింది. మైనర్ పై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టగా.. పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే, నిందితుడు బెయిల్ bail కోసం అలహాబాద్ హైకోర్టును Allahabad High Court ఆశ్రయించగా, న్యాయస్థానం విచారణ చేపట్టింది. అత్యాచార బాధితురాలు.. “ఆమె స్వయంగా ఇబ్బందులను ఆహ్వానించింది” అని హైకోర్టు High Court విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది.
అలాగే, నిందితుడికి బెయిల్ మంజూరు granting bail చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ ఉదంతంపై సుప్రీంకోర్టు Supreme Court మంగళవారం స్పందిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వును తీవ్రంగా తప్పుబట్టింది. వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి Supreme Court judge జస్టిస్ బీఆర్ గవాయ్ Justice BR Gavai.. న్యాయమూర్తులకు సూచించారు. హైకోర్టు న్యాయమూర్తి అసలు ఎందుకు ఈ వ్యాఖ్య చేయాల్సిన అవసరం వచ్చిందని జస్టిస్ గవాయ్ ఆశ్చర్యపోయారు.
Supreme Court | మరో అంశంలోనూ..
అలహాబాద్ హైకోర్టు Allahabad High Court ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బాధితురాలి ఛాతిని తాకడం, బాధితురాలిని కల్వర్టు కిందకు లాక్కెళ్లడానికి ప్రయత్నించడం వంటివి అత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నం కింద నేరం మోపడానికి సరిపోదని అలాహాబాద్ హైకోర్టు Allahabad High Court ఇటీవల పేర్కొంది. దీన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది.