అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసు గురించి బయట మాట్లాడొద్దని న్యాయస్థానం సూచించింది. రూ. 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లొద్దని, అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దని స్పష్టం చేసింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మార్చి21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆరు నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఆయన బయటకు రానున్నారు. కాగా ఇదే కేసులో ఇటీవల తెలంగాణ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే.